close

తెలంగాణ

ఉమ్మడి చెక్‌ పవర్‌ను రద్దు చేయాలి

విపక్ష నేతల డిమాండ్‌

కాచిగూడ, న్యూస్‌టుడే: ఉప సర్పంచి ఉమ్మడి చెక్‌ పవర్‌ను రద్దు చేయాలని పలువురు విపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ చర్యలు పంచాయతీరాజ్‌ స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. గ్రామ పంచాయతీ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూమన్న యాదవ్‌ అధ్యక్షతన ‘సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలు- పరిష్కార మార్గాలు, భవిష్యత్తు కార్యాచరణ’ అనే అంశంపై గురువారం హైదరాబాద్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఉమ్మడి చెక్‌పవర్‌ లేదన్నారు. సర్పంచుల సమస్యలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో దిల్లీలో ప్రధాని, రాష్ట్రపతి, కేంద్ర మంత్రిని కలిసి గ్రామాలకు నేరుగా నిధులు ఇచ్చేలా ఉద్యమిద్దామని తెలిపారు.  సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూమన్న యాదవ్‌ మాట్లాడుతూ.. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో సర్పంచుల సంఘం తరఫున అభ్యర్థిని బరిలోకి దించుతామన్నారు. తెజస రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ గ్రామ పంచాయతీ వ్యవస్థను దిగజార్చేందుకే కలెక్టర్లకు అధికారాలు ఇచ్చారని పేర్కొన్నారు. మాజీ మంత్రి డీకే అరుణ, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు మాట్లాడారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు