close

ఆంధ్రప్రదేశ్

పీఏసీ ఛైర్మన్‌గా పయ్యావుల కేశవ్‌

అంచనాల కమిటీకి రాజన్నదొర
ప్రభుత్వరంగ సంస్థల కమిటీకి చిర్ల జగ్గిరెడ్డి
అసెంబ్లీ కమిటీల నియామకం

ఈనాడు, అమరావతి: అసెంబ్లీ నూతన కమిటీలను నియమించారు. ఛైర్మన్‌తో పాటు మొత్తం 12 మంది (ముగ్గురు చొప్పున ఎమ్మెల్సీలు)తో ఒక్కో కమిటీని నియమిస్తూ అసెంబ్లీ నుంచి గురువారం బులిటెన్‌ వెలువడింది. ఉరవకొండ తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ఛైర్మన్‌గా ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ), సాలూరు వైకాపా ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఛైర్మన్‌గా అంచనాల కమిటీ, కొత్తపేట వైకాపా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఛైర్మన్‌గా ప్రభుత్వ రంగ సంస్థల (పబ్లిక్‌ అండర్‌టేకింగ్‌) కమిటీని ప్రకటించారు.

ప్రజాపద్దుల కమిటీలో: ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య (సూళ్లూరుపేట), కోలగట్ల వీరభద్రస్వామి (విజయనగరం), మేరుగ నాగార్జున (వేమూరు), భూమన కరుణాకరరెడ్డి (తిరుపతి), కరణం ధర్మశ్రీ (చోడవరం), జోగి రమేష్‌ (పెడన), కేవీ ఉషాశ్రీచరణ్‌ (కళ్యాణదుర్గం), కాటసాని రాంభూపాల్‌రెడ్డి (పాణ్యం), ఎమ్మెల్సీల్లో బీద రవిచంద్ర,    డి.జగదీశ్వరరావు, విఠపు బాలసుబ్రహ్మణ్యం..

అంచనాల కమిటీలో: ఎమ్మెల్మేలు గుడివాడ అమరనాథ్‌ (అనకాపల్లి), రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి (కావలి), గొర్లె కిరణ్‌కుమార్‌ (ఎచ్చెర్ల), గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (నరసరావుపేట), కైలే అనిల్‌ కుమార్‌ (పామర్రు), మద్దిశెట్టి వేణుగోపాల్‌ (దర్శి), మద్దాలి గిరిధర్‌రావు (గుంటూరు పశ్చిమ), ఆదిరెడ్డి భవాని (రాజమండ్రి నగర), ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, పరుచూరి అశోక్‌బాబు, వెన్నపూస గోపాల్‌రెడ్డి.

ప్రభుత్వ రంగ సంస్థల కమిటీలో: ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్‌ (భీమవరం), కిలారి వెంకట రోశయ్య (పొన్నూరు), జొన్నలగడ్డ పద్మావతి (శింగనమల), అన్నా రాంబాబు (గిద్దలూరు), సీహెచ్‌ వేణుగోపాలకృష్ణ (రామచంద్రపురం), పి.రవీంద్రనాథ్‌రెడ్డి (కమలాపురం), డి.చంద్రశేఖరరెడ్డి (కాకినాడ), వాసుపల్లి గణేష్‌కుమార్‌ (విశాఖ దక్షిణ), ఎమ్మెల్సీలు ఎం.వెంకట సత్యనారాయణ రాజు, గుణపాటి దీపక్‌రెడ్డి, సోము వీర్రాజు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు