close

తెలంగాణ

యువజన కమిషన్‌ ఏర్పాటు చేయండి

బడ్జెట్‌ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించండి
కేసీఆర్‌కు రేవంత్‌ బహిరంగ లేఖ

రాష్ట్రంలో యువత సమస్యల పరిష్కారానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ‘తెలంగాణ రాష్ట్ర యువజన కమిషన్‌’ ఏర్పాటు చేయాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను కోరారు. బడ్జెట్‌ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించి, చట్టం తేవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. ‘‘ఇంటికో ఉద్యోగం ఇస్తానని అనేక సభల్లో ప్రకటించి.. అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. 2.5 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉండగా.. టీఎస్‌పీఎస్సీ ద్వారా 31 వేలు; ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులు మరో 28 వేలు మాత్రమే భర్తీ చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 14 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. లేబర్‌ ఫోర్స్‌ సర్వేలో 22 రాష్ట్రాల్లో తెలంగాణ 5వ స్థానంలో ఉంది’’ అని రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు