close

తెలంగాణ

ఎమ్మెల్యేల మాటల యుద్ధం

రాజగోపాల్‌రెడ్డి, భట్టి, ఉపేందర్‌రెడ్డిల వాగ్వాదం

రాష్ట్ర శాసనసభ అంతర ప్రాంగణంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, తెరాస ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం సభలో విద్యాశాఖపై చర్చ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమాధానమిస్తున్న సమయంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బయటికొచ్చారు. ఆ సమయంలో రాజగోపాల్‌రెడ్డికి ఉపేందర్‌రెడ్డి తారసపడ్డారు. ఉపేందర్‌రెడ్డి పార్టీ మారిన విషయంపై వారిద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. వారించేందుకు వచ్చిన భట్టికి, ఉపేందర్‌రెడ్డికి మధ్య ఇది కొనసాగింది. ఒకరిని ఉద్దేశించి మరొకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నారు. మాటలు తీవ్రస్థాయికి చేరడంతో అక్కడే ఉన్న ఇతర ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు. ముగ్గురిని అక్కడి నుంచి తీసుకెళ్లారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు