close

తెలంగాణ

విద్యుత్తు కొనుగోళ్లపై దోషిగా నిలబెడతాం

ప్రభుత్వంపై లక్ష్మణ్‌ ధ్వజం
రేవంత్‌కు కాంగ్రెస్‌పై నమ్మకం లేదని వ్యాఖ్య

ఈనాడు, హైదరాబాద్‌: సింగరేణిలో తెరాస అనుబంధ కార్మిక సంఘం నిలువునా చీలడంతో ఎన్నికలను వాయిదా వేసేందుకు రాష్ట్రప్రభుత్వం కుట్రలు చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. గతేడాది కంటే కేవలం 1 శాతం బోనస్‌ పెంచి కేసీఆర్‌ గొప్పలు చెప్పుకుంటున్నారని.. కార్మికులకు 30 శాతం బోనస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం బొగ్గు రేట్లను పెంచడం వల్లే సింగరేణి లాభాల బాటలోకి వచ్చిందని చెప్పారు. కార్మికులకు చెల్లించే ప్రతి రూపాయిలో 49 పైసలు కేంద్రానివేనని చెప్పారు. ‘‘సింగరేణి నుంచి రూ.3.42కు యూనిట్‌ విద్యుత్తు కొన్న ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల నుంచి రూ.7కు కొనడం వెనుక మతలబేంటి? సింగరేణికి డబ్బులివ్వకుండా ఇచ్చినట్లు సీఎం అబద్ధాలు చెప్పారు. ఆయనకు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలి’’ అని లక్ష్మణ్‌ పేర్కొన్నారు. ‘‘రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌పై నమ్మకం లేదు. విద్యుత్తు కొనుగోళ్లలో అక్రమాలపై ఆధారాలు నాకు ఇస్తాననడం సంతోషం. తెరాసలో, కాంగ్రెస్‌లో తాజా పరిణామాలు భాజపాకు లాభిస్తాయి. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికపై భాజపా చాపకింద నీరులా పని చేస్తోంది’’ అని లక్ష్మణ్‌ వివరించారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు