close

ఆంధ్రప్రదేశ్

సరికొత్త రోబోల సృష్టి!

వాషింగ్టన్‌: స్వీయ నియంత్రణతో కూడిన రోబో(బయోబోట్‌)ల తయారీ దిశగా అమెరికాలోని ఇల్లినాయిస్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. కాంతితో ప్రేరేపితమై పనిచేసే కండర కణజాలాన్ని ఉపయోగించి కొత్త తరం రోబోలను తయారుచేశారు. ఆన్‌ బోర్డ్‌ మోటార్‌ నాడీకణాలు(న్యూరాన్లు) వాటిలో కీలక పాత్ర పోషిస్తాయి. తాజా పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు ఎలుకల మూలకణాల నుంచి సేకరించిన నాడీ కణ సంవర్ధనాన్ని(కల్చర్‌) రోబోల కండర కణజాలానికి చేరువలో పూశారు. అందులోని నాడీకణాలు క్రమంగా కండరాలపైకి చేరుకొని నాడీకండర సమ్మేళనాలను ఏర్పరిచాయి. నాడీకణాలు కాంతితో ఉత్తేజితమై కండరాలనూ కదిలించేందుకు ఇవి దోహదపడ్డాయి. అధిక స్థిరత్వం చేకూర్చడం కోసం తాజా రోబోలకు రెండు తోకలను అమర్చినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు