close

ఆంధ్రప్రదేశ్

మిగిలిపోనున్న పోస్టులు

సచివాలయ ఉద్యోగాల్లోని 6 విభాగాల్లో ఇదే పరిస్థితి
7,723 పశుసంవర్థక సహాయకుల పోస్టులు మిగులు

ఈనాడు, అమరావతి: సచివాలయ ఉద్యోగాల్లో ఆరు విభాగాల్లో పోస్టులు మిగిలిపోతున్నాయి. గురువారం విడుదలైన ఫలితాల్లో కేటగిరీల వారీగా అర్హత మార్కులు ఆధారంగా అర్హత సాధించినవారి వివరాలు ప్రకటించారు. కొన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల కంటే అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉందని తేలింది. పశుసంవర్థక సహాయకుల పోస్టులు 9,886 ఉండగా, వీటికి దరఖాస్తులే 6,265 వచ్చాయి. అందులోనూ 5,608 మంది పరీక్షలు రాయగా, 2,163 మంది అర్హత సాధించారు. అంటే అర్హత పొందినవాళ్లు కాకుండా ఇంకా 7,723 పోస్టులు మిగిలిపోనున్నాయి.
* ఇంకా పంచాయితీ కార్యదర్శి (గ్రేడ్‌-6) డిజిటల్‌ సహాయకుల పోస్టులు 11,158 ఉండగా, 3,623 మంది అర్హత సాధించారు.
* వార్డు పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శి పోస్టులు 3,648 ఉండగా, 1,474 మంది మాత్రమే అర్హత పొందారు.
* గ్రామఉద్యాన సహాయకుల పోస్టులు 4 వేలుఉండగా, 2,622మంది అర్హత సాధించారు.
* వార్డు ప్రణాళిక, రెగ్యులేషన్‌ కార్యదర్శి పోస్టులు 3,770 ఉండగా, 2,096 మంది అర్హత పొందారు.
* గ్రామ వ్యవసాయ సహాయకుల పోస్టులు 6,714 ఉండగా, 6,239 మంది అర్హత పొందారు.

నేడు ప్రతిభావంతుల జాబితా

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం ప్రతిభావంతుల జాబితా (మెరిట్‌ లిస్ట్‌)ను శుక్రవారం ప్రకటించనున్నారు. 14 రకాల పరీక్షలకు సంబంధించి అర్హతను మించి మార్కులు సాధించిన అభ్యర్థుల జాబితా నుంచి రిజర్వేషన్ల ప్రకారం మెరిట్‌ లిస్ట్‌ను రూపొందించి గ్రామ, వార్డు సచివాలయ వెబ్‌సైట్‌లో పెట్టనున్నారు.


గ్రూపు-2, 3 ఫలితాలు విడుదల చేయాలి: నిరుద్యోగ ఐకాస

సచివాలయ ఉద్యోగాల ఎంపిక పూర్తి కాక ముందే గ్రూపు-2, గ్రూపు-3 ఫలితాలు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగ ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు ఎం.హేమంత్‌కుమార్‌ ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముందుగా ప్రకటిస్తే 1,500 మందికి ఉద్యోగాలొచ్చి సచివాలయ ఉద్యోగాల్లో పోటీ తప్పుతుందన్నారు. డిజిటల్‌ అసిస్టెంట్‌ పోస్టుల కంటే పరీక్షల్లో ఉత్తీర్ణులు తక్కువగా ఉన్నందున అర్హత మార్కులు తగ్గించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు