close

ఆంధ్రప్రదేశ్

12 ఏళ్లకే పిల్లర్లు శిథిలం

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వెంకటరత్నపురంలోని సత్యప్రసన్న నగర్‌లో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనం పిల్లర్లకు బీటలు వారాయి. గురువారం సాయంత్రం దీన్ని గమనించిన నివాసితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. భాస్కర ఎస్టేట్స్‌ పేరిట 12ఏళ్ల క్రితం ఈ భవనాన్ని రెండు బ్లాకులుగా నిర్మించారు. మొత్తం 40 ఫ్లాట్లు ఉండగా, 30 కుటుంబాలకు పైగా నివసిస్తున్నాయి. మిగిలిన ఫ్లాట్లను ప్రైవేటు సంస్థల కార్యాలయాలకు అద్దెకిచ్చారు. ప్రస్తుతం భవనానికి వెనుక బ్లాకులో గల పిల్లర్లు బీటలు వారాయి. వాటి మధ్యలోని కాంక్రీటు పెచ్చులూడి, ఊచలు వంకర్లు తిరిగాయి. 5 పిల్లర్లకుగానూ మూడు పిల్లర్లు ఇలా మారాయి. విషయం తెలుసుకున్న పోలీసు, నగరపాలక సంస్థ అధికారులు భవనం వద్దకు చేరుకుని అందులో నివసిస్తున్నవారిని ఖాళీ చేయించారు. ముందు బ్లాకులో ఉంటున్న వారు తమ ఫ్లాట్లను ఖాళీ చేయకపోవడంతో వారిని బలవంతంగా బయటకు పంపిస్తున్నారు.

-న్యూస్‌టుడే, గాంధీనగర్‌(కాకినాడ)


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు