close

ఆంధ్రప్రదేశ్

సెలవు లేని చోదకుడు

ఆర్టీసీని వేధిస్తున్న డ్రైవర్ల కొరత
డిపోల్లో కదలని బస్సులు
డబుల్‌ డ్యూటీలతో భద్రతకు ముప్పు
ఈనాడు - విశాఖపట్నం

విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెం డిపోకు చెందిన శివరామరాజుకు డ్రైవరుగా 32 ఏళ్ల సర్వీసు ఉంది. రీజనల్‌ స్థాయిలో అయిదుసార్లు ఉత్తమ కేఎంపీఎల్‌ డ్రైవర్‌గా అవార్డులు అందుకున్నారు. ఆయన సర్వీసుకు ఎప్పుడో పదోన్నతి రావాలి. కానీ డ్రైవర్‌గానే ఉద్యోగ విరమణ చేయాల్సి వస్తోంది. పదోన్నతుల విషయం పక్కన పెట్టండి.. నాలుగు నెలలుగా సెలవే దొరకలేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ ఆర్టీసీలో డ్రైవర్ల దుస్థితి.

చోదకులు లేక ప్రగతి రథచక్రం పరుగు మందగిస్తోంది. డ్రైవర్లు చాలక ఆర్టీసీ అవస్థలు పడుతోంది. నడిపేవారు లేక రోజూ 1000 బస్సులు డిపోల నుంచి కదలడం లేదు. సరిపడా సర్వీసులు లేక ప్రయాణికులూ అవస్థలు పడుతున్నారు. మరోవైపు సెలవులు దొరక్క, సరైన విశ్రాంతి లేక డ్రైవర్లు శారీరకంగా, మానసికంగా అలసిపోతున్నారు. డ్రైవర్ల కొరత కారణంగా రాష్ట్రంలో రోజూ 2వేల మంది డ్రైవర్లు డబుల్‌ డ్యూటీలు చేయాల్సి వస్తోంది. సర్వీసు ఆధారంగా వీరికి అదనంగా రూ.1,500- 2,500 చెల్లించాలి. కానీ రూ.450 మాత్రమే  చెల్లిస్తోందని ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (ఈయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దామోదరరావు చెప్పారు. సెలవులు దొరక్క, సరైన విశ్రాంతి లేక వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు.

కండక్టర్లకూ సంకటమే
డ్రైవర్లు లేకపోవడంతో కండక్టర్లను విధులకు పంపకుండా సెలవులు రాసేస్తున్నారు. దీంతో ఏడాది పొడవునా వినియోగించుకోవాల్సిన సెలవులు రెండు నెలలకే అయిపోతున్నాయి. అవసరమైనప్పుడు సెలవు దొరక్క అవస్థలు పడుతున్నామని కండక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు