close

తెలంగాణ

రైతుయంత్ర.. లాభమంత్ర!

నిర్మల్‌ జిల్లాలో ప్రత్యేక  యాప్‌తో సత్ఫలితాలు
రైతులు, ట్రాక్టర్‌ యజమానులకు ప్రయోజనం

నిర్మల్‌, న్యూస్‌టుడే: సాగు వ్యయం తగ్గించి అన్నదాతలకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో ‘ట్రాక్టర్‌ ఆన్‌ డిమాండ్‌’ పేరుతో రూపొందించిన రైతుయంత్ర యాప్‌ నిర్మల్‌ జిల్లాలో సత్ఫలితాలు ఇస్తోంది. ఇప్పటికే పైలెట్‌ ప్రాజెక్టు కింద కొన్ని మండలాల్లో ప్రారంభించిన సేవలను ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా విస్తరించారు. కలెక్టర్‌ ఎం.ప్రశాంతి ప్రత్యేక చొరవ, జనస్పందన సాఫ్ట్‌వేర్‌ సౌజన్యంతో అభివృద్ధి చేసిన ఈ యాప్‌తో రైతులు, ట్రాక్టర్‌ యజమానులకు ఎంతో ప్రయోజనం చేకూరుతోంది.


ఏమిటీ యాప్‌?

రైతన్న సాగుచేసే పంటలకు యాంత్రీకరణను మరింత చేరువ చేసి వ్యవసాయ పనులను తక్కువ ధరకు అందించాలన్న ఉద్దేశంతో రైతుయంత్ర యాప్‌ రూపొందించారు. వ్యవసాయ సామగ్రి అవసరం ఉందని ఈ యాప్‌ ద్వారా బుక్‌ చేసుకుంటే ప్రస్తుత బహిరంగ విపణిలో ఉన్న ధరల కంటే తక్కువకు పొందొచ్చు. తొలుత రైతుయంత్ర యాప్‌లోకి వెళ్లాలి. అందులో జిల్లా పేరు, రైతు పేరు, వ్యవసాయ క్లస్టర్‌ గ్రామం, ట్రాక్టర్‌ ఏ పనికి ఉపయోగించుకుంటున్నారు.. పని గంటలు.. ఇలా అన్ని వివరాలు నమోదు చేయాలి. ఈ వివరాలన్నీ వెంటనే సంబంధిత గ్రామంలో ఉన్న ట్రాక్టర్‌ యజమానుల స్మార్ట్‌ఫోన్‌కి వెళ్తాయి. స్మార్ట్‌ఫోన్‌ లేనివారికి సాధారణ మెసేజ్‌ ద్వారా సమాచారం చేరుతుంది.


బుకింగ్‌ ఆధారంగా..

యాప్‌లో బుకింగ్‌ ఆధారంగా సంబంధిత ట్రాక్టర్‌ యజమానులు ఆ రైతు వద్దకు వెళ్లి పనులు చేస్తారు. ఇందు కోసం ప్రత్యేకంగా ధరలు కేటాయించారు. వివిధ సందర్భాల్లో గంట సమయానికి పెద్దనాగలి, కల్టివేటర్‌, రొటొవేటర్‌, కేజ్‌వీల్‌, ట్రాన్స్‌పోర్ట్‌ ట్రాలీ, సీడ్‌ కం ఫెర్టిలైజర్‌ సరఫరాకు రూ.5,400 చెల్లించాల్సి వస్తుండగా.. ప్రస్తుతం యాప్‌ ద్వారా రూ.4,150తో ఈ పనులన్నీ పూర్తవుతున్నాయి. గంట పనులకు అన్నదాతకు రూ.1,250 మిగులుతుండటంతో వారంతా సంతోషం వ్యక్తంచేస్తున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు