close

తెలంగాణ

పొరుగు సేవలు సిబ్బందికి వెయిటేజిపై హైకోర్టులో వాదనలు

ఈనాడు, హైదరాబాద్‌: జెన్‌కో, ట్రాన్స్‌కోలో ఖాళీల భర్తీ ప్రక్రియలో పొరుగుసేవల సిబ్బందికి 20 మార్కులు వెయిటేజీగా ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. వాదనల కొనసాగింపునకు అనువుగా విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ పి.నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారించింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు