close

తెలంగాణ

సింగరేణి కార్మికులకు రూ. లక్ష బోనస్‌

ప్రకటించిన  ప్రభుత్వం

ఈనాడు - హైదరాబాద్‌

సింగరేణి కార్మికులకు ప్రభుత్వం బోనస్‌ ప్రకటించింది. సంస్థ లాభాల్లో 28 శాతం వాటాను కార్మికులకు అందజేస్తున్నట్లు గురువారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శాసనసభలో ప్రకటించారు. ప్రతి కార్మికుడికి రూ. 1,00,899 బోనస్‌ అందనుందని పేర్కొన్నారు. ఇది దసరా సందర్భంగా ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అందిస్తున్న కానుకని తెలిపారు. ‘‘సమైక్య పాలనలో 2013-14లో రూ.13,450 చొప్పున మాత్రమే బోనస్‌ ఇచ్చారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం దీనిని పెంచుతూ వస్తోంది. 2017-18 లాభాల్లో 27 శాతం వాటా ఇచ్చాం. ఈ ఏడాది ఒక్కో కార్మికుడికి రూ.40,530 అదనంగా అందించనున్నాం. రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తోంది. ప్రభుత్వం ఇస్తున్న సహకారం, కార్మికుల సంక్షేమానికి తీసుకున్న చర్యల ఫలితంగా సింగరేణి పనితీరు గణనీయంగా మెరుగుపడి రికార్డు స్థాయి ఉత్పత్తి సాధిస్తోంది. 2018-19లో 64.41 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సాధించి రూ. 1,765 కోట్ల గరిష్ఠ లాభాలను సాధించింది. ఉత్పత్తి, రవాణా, అమ్మకం, లాభాలు, టర్నోవర్‌లలో ఆ సంస్థ సాధిస్తున్న ప్రగతి ప్రభుత్వ పాలనా దక్షతకు ప్రతీకగా నిలుస్తున్నాయి. కోల్‌ ఇండియాతో పోలిస్తే సింగరేణి ఎంతో మెరుగ్గా ఉండటం మనందరికీ గర్వకారణం. సింగరేణి విజయ ప్రస్థానంలో కార్మికులదే ముఖ్య భూమిక. నిత్యం మృత్యుఒడిలోకి వెళ్లి వచ్చే ఈ కార్మికులు చిందిస్తున్న స్వేదం సరిహద్దుల్లోని సైనికుల త్యాగనిరతికి ఏమాత్రం తీసిపోదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే వారి సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం. కార్మికులు, సిబ్బంది మరింత అంకితభావంతో పనిచేసి సంస్థకు లాభాలు, విజయాలు తెచ్చిపెడతారని ఆకాంక్షిస్తున్నాను’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు