close

తెలంగాణ

యూరియా కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యవసాయ అవసరాలకు మరో 50 వేల మెట్రిక్‌ టన్నుల యూరియాను పంపిణీ చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ కార్యదర్శి చబీలేంద్ర రౌల్‌కు గురువారం లేఖ రాశారు. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన వర్షాల వల్ల ప్రాజెక్టులు, చెరువుల్లోకి నీరు చేరడం వల్ల ఖరీఫ్‌, రబీ పంటలకు యూరియా అవసరం ఉంటుందని లేఖలో పేర్కొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు