close

తెలంగాణ

కోరుట్ల పురపాలికకు స్కోచ్‌ పురస్కారం

కోరుట్ల, న్యూస్‌టుడే: జగిత్యాల జిల్లా కోరుట్ల పురపాలిక ప్రతిష్ఠాత్మక జాతీయ స్కోచ్‌ పురస్కారానికి ఎంపికైంది. ఈ అవార్డు కోసం జాతీయ స్థాయిలో 1000 దరఖాస్తులు రాగా వాటిలో 150 సెమీఫైనల్లో నిలిచాయి. దరఖాస్తులను పరిశీలించిన జ్యూరీ కమిటీ కోరుట్ల పురపాలిక చేపడుతున్న ‘స్థిర పారిశుద్ధ్య నిర్వహణ’ అంశంపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ను పరిగణనలోకి తీసుకుని పోటీకి ఎంపిక చేసింది. స్కోచ్‌ పురస్కారాన్ని పొందేందుకు సామాజిక మాధ్యమంలో పట్టణ పౌరుల నుంచి పురపాలికకు వచ్చే ఓట్లను పరిగణనలోకి తీసుకుంది. కోరుట్ల పురపాలికకు 158 ఓట్లు రాగా.. పురస్కారానికి ఎంపికైనట్లు స్కోచ్‌ గ్రూప్‌ గురువారం ప్రకటించింది. 15శాతం ప్రాజెక్టుల్లో కోరుట్ల పురపాలిక ఉత్తమంగా నిలిచిందని స్కోచ్‌ ఎడిటర్‌ డాక్టర్‌ గురుశరన్‌ దంజల్‌ లేఖలో పేర్కొన్నారు. పురస్కారాన్ని అందుకోవడానికి ఈ నెల 25న దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియాలో జరిగే అత్యున్నత స్థాయి సదస్సుకు రావాల్సిందిగా కోరుట్ల మున్సిపల్‌ కమిషనర్‌ అయాజ్‌ను ఆహ్వానించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు