close

తెలంగాణ

అంతర్జాతీయ ప్రాసిక్యూటర్ల సదస్సులో   పాల్గొన్న పద్మారావు లక్కరాజు

ఈనాడు, హైదరాబాద్‌: భారత్‌లో అమల్లో ఉన్న పలు చట్టాల గొప్పతనాన్ని, పూర్వం నుంచి అవి పరిణామం చెందిన తీరును అర్జెంటీనా వేదికగా తెలంగాణ బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధి పద్మారావు లక్కరాజు ప్రపంచానికి వివరించారు. అర్జెంటీనా రాజధాని బ్యూనస్‌ ఎయిర్స్‌లో గురువారం జరిగిన అంతర్జాతీయ ప్రాసిక్యూటర్ల వార్షిక సదస్సుకు మనదేశం తరఫున హాజరై ఆయన ప్రసంగించారు. బాలలపై హేయమైన నేరాలకు పాల్పడే వ్యక్తులను కఠినంగా శిక్షించేందుకు వీలుగా సంబంధిత చట్టానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సవరణలు చేపట్టిన సంగతిని ప్రస్తావించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు