close

తెలంగాణ

యాదాద్రిలో శిల్పకారుల జాతీయ సదస్సు

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రిలో నవంబర్‌ 9, 10 తేదీల్లో రెండు రోజులపాటు శిల్పకారుల జాతీయ సదస్సు జరగనుంది. దేశంలో ఆదరణ లేక అంతరించిపోతున్న ప్రాచీన కళలకు పూర్వ వైభవం తీసుకొచ్చే యోచనతో సదస్సు నిర్వహించన్నుట్లు వృత్తికారుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి అట్లూరి రవీంద్రచారి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృఢ సంకల్పంతో పునర్‌నిర్మితమవుతోన్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయమంతా కృష్ణ శిలతోనే రూపొందించడం విశేషమని పేర్కొన్నారు. అంతరించుకుపోతున్న శిల్పకళా వైభవాన్ని మరోమారు చాటేందుకు సీఎం సంకల్పించడం హర్షణీయమన్నారు. శిల్పకళా సంపదతో రూపొందుతున్న యాదాద్రిలోనే సదస్సు నిర్వహించేందుకు సన్నద్ధమయ్యామని తెలిపారు. జాతీయ స్థాయిలో జరగనున్న ఈ సదస్సులో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చే కళాకారులకు మౌలిక వసతులు కల్పించాలంటూ యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డికి గురువారం వినతిపత్రం అందజేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు