close

తెలంగాణ

యురేనియం అన్వేషణకు జోగు రామన్న అనుమతిచ్చారు

కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: తెలంగాణలో యురేనియం తవ్వకాలకు కేంద్రం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. 2016 డిసెంబరు 6న వన్యప్రాణి బోర్డు ఛైర్మన్‌గా ఉన్న సీఎం కేసీఆర్‌ ఆ సమావేశానికి హాజరుకాకుండా నాటి అటవీ మంత్రి జోగురామన్నను పంపారని, యురేనియం అన్వేషణకు నాడు మంత్రి అనుమతి ఇచ్చారన్నారు. ప్రస్తుతం యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

మాంద్యం నుంచి ఉపశమనం కలిగించాలి: రాఘవులు
కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మాంద్యం నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు డిమాండ్‌ చేశారు. దిల్లీలో గురువారం ఆయన  మాట్లాడారు. రెండు రోజుల పాటు జరిగిన సీపీఎం పొలిట్‌బ్యూరో సమావేశాల్లో ప్రధానంగా ఆర్ధిక మాంద్యంపై చర్చించినట్లు చెప్పారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు