close

తెలంగాణ

ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు ముందుకొచ్చిన టెక్‌ మహేంద్ర, వోక్సన్‌

ఈనాడు, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల స్థాపనకు ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలికి రెండు సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. టెక్‌ మహేంద్రతో పాటు వోక్సన్‌ విద్యాసంస్థ రూ.10లక్షలు చెల్లించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) సమర్పించాయి. ప్రస్తుతం టెక్‌ మహేంద్ర ఫ్రాన్స్‌కు చెందిన ఇకొలే సెంట్రల్‌తో కలిసి 2014 నుంచి మేడ్చల్‌ జిల్లా దూలపల్లిలో ఇంజినీరింగ్‌ కళాశాలలను నడుపుతోంది. దాన్ని ప్రైవేట్‌ విశ్వవిద్యాలయంగా మార్చుకోవడానికి ముందుకొచ్చింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట వద్ద పినాకిని ఎడ్యుకేషన్‌ సొసైటీ వోక్సెన్‌ పేరిట కళాశాలలను నిర్వహిస్తోంది. అది సైతం ప్రైవేట్‌ వర్సిటీగా మారేందుకు దరఖాస్తు చేసింది. పలు సంస్థలు దరఖాస్తును తీసుకున్నా.. రూ.10లక్షల రుసుం చెల్లించి డీపీఆర్‌ సమర్పించింది ఈ రెండేనని ఉన్నత విద్యామండలి వర్గాలు తెలిపాయి. ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల స్థాపనకు రెండు వారాల క్రితం నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు