close

తెలంగాణ

బీటీపీఎస్‌ మొదటి యూనిట్‌ సింక్రనైజేషన్‌ పూర్తి

35 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి

పీవీకాలనీ (మణుగూరు), న్యూస్‌టుడే: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పరిధిలోని భద్రాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రంలో 270 మెగావాట్ల సామర్థ్యం గల మొదటి యూనిట్‌ సింక్రనైజేషన్‌ను గురువారం నిర్వహించారు. బీటీపీఎస్‌ కంట్రోల్‌ యూనిట్‌ విభాగంలో జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు చేతుల మీదుగా సింక్రనైజేషన్‌ చేశారు. ఇది పూర్తయిన వెంటనే తొలి యూనిట్‌ నుంచి 35 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అయింది. ట్రాన్స్‌కో గ్రిడ్‌కి 5 మెగావాట్ల విద్యుత్తు అనుసంధానం అయినట్లు బీటీపీఎస్‌ అధికారులు తెలియజేశారు. సింక్రనైజేషన్‌ విజయవంతం కావటంతో జెన్‌కో డైరెక్టర్లను, ఇంజినీర్లను.. సీఎండీ అభినందించారు. ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. ఎన్జీటీ నుంచి అనుమతులు రావటంలో ఆలస్యం వల్ల బీటీపీఎస్‌ పనులు కొంత నెమ్మదిగా జరిగాయని తెలిపారు. అధిక వర్షాలు పనుల జాప్యానికి మరో కారణమన్నారు. మిగిలిన మూడు యూనిట్ల నిర్మాణ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసి, వచ్చే ఏడాది మార్చిలోపు 1080 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి రాష్ట్ర అవసరాల కోసం సీఓడీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జెన్‌కో డైరెక్టర్లు సచిదానందం, అజయ్‌, లక్ష్మయ్య, సీఈ బాలరాజు, సీఈ టీపీసీ శ్రీనివాసు భెల్‌ ఈడీ చక్రవర్తి, జీఎం అగర్వాల్‌ పాల్గొన్నారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు