close

తెలంగాణ

కమ్యూనిస్టు ఉద్యమనేత కొండమ్మ మృతి

హైదరాబాద్‌, వీరపునాయునిపల్లె, న్యూస్‌టుడే:  కమ్యూనిస్టు ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే నర్రెడ్డి శివరామిరెడ్డి సతీమణి కొండమ్మ (89) గురువారం హైదరాబాద్‌లోని తన కుమార్తె భగీరథి ఇంట్లో అనారోగ్యంతో కన్నుమూశారు. కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం గడ్డంవారిపల్లెకు చెందిన ఈమె కమ్యూనిస్టు ఉద్యమంలో భర్తకి చేదోడువాదోడుగా నడిచారు. 1949 అక్టోబరు 1న వీరపునాయునిపల్లె మండలం యు.రాజుపాలెం గ్రామంలో కమ్యూనిస్టులపై పోలీసు కాల్పుల ఘటన అనంతరం కమ్యూనిస్టు నేతల భార్యలతో కలిసి ఆమె మహిళా ఉద్యమం నిర్మించారు. సాయుధ పోరాటం నిమిత్తం శేరు బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. కొండమ్మ పార్థివదేహానికి సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ నివాళులర్పించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు