close

తెలంగాణ

సింగరేణి కార్మికులకు ముందుగానే దసరా: ఈశ్వర్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: సింగరేణి లాభాల్లో 28 శాతం కార్మికులకు ఇవ్వాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో కార్మికులకు దసరా పండుగ ముందే వచ్చిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. సీఎం నిర్ణయంతో ప్రతి కార్మికుడికి రూ.1,00,899 బోనస్‌ అందుతుందన్నారు. ఎమ్మెల్యే బాల్కసుమన్‌ మాట్లాడుతూ.. 2013-14లో అప్పటి ప్రభుత్వం రూ.13,545 బోనస్‌ ఇస్తే తెరాస వచ్చిన ఐదేళ్లలో క్రమక్రమంగా పెంచుతూ వస్తోందన్నారు. సింగరేణి కార్మికులకు 40వేలకు పైగా అదనంగా బోనస్‌ కేసీఆర్‌ పెంచారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రతి కార్మికునికీ రూ.1,00,899 బోనస్‌ ప్రకటించి కార్మికులపై తనకున్న అభిమానాన్ని ఆయన చాటుకున్నారన్నారు. సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, హరిప్రియానాయక్‌, దుర్గం చిన్నయ్య, దివాకర్‌రావు, ఆత్రం సక్కు పాల్గొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు