close

తెలంగాణ

వాల్మీకి కాదు.. గద్దలకొండ గణేష్‌

హైదరాబాద్‌, ఈనాడు డిజిటల్‌: ‘వాల్మీకి’ టైటిల్‌ని ‘గద్దలకొండ గణేష్‌’గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు దర్శక నిర్మాతలు. 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి హరీష్‌ శంకర్‌ దర్శకుడు. టైటిల్‌ తమ మనోభావాల్ని దెబ్బతీసేలా ఉందని బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. ఈ విషయమై న్యాయస్థానం చిత్రబృందానికి నోటీసులు జారీ చేసింది. అనంతపురం, కర్నూలు జిల్లాలలో ‘వాల్మీకి’ విడుదలకు అడ్డంకులు ఎదురయ్యాయి. చిత్ర విడుదలను ఈ రెండు జిల్లాలలో నిలిపివేశారు. దాంతో నిర్మాతలు  సినిమా పేరుని ‘గద్దలకొండ గణేష్‌’గా మార్చారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు