close

తెలంగాణ

కుంగిన పుట్టంగండి ఆనకట్ట

 ప్రాజెక్టును సందర్శించిన ఎస్‌ఈ

పుట్టంగండి (పెద్దఅడిశర్లపల్లి), న్యూస్‌టుడే: నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం పుట్టంగండి గ్రామం వద్ద నిర్మించిన ఆనకట్టపై ప్రమాదరకర నెర్రె ఏర్పడింది. మంగళవారం రాత్రి జిల్లాలో కురిసిన కుంభవృష్టి తాకిడికి పట్టంగండి ప్రాజెక్టు 1.8వ కిలోమీటరు వద్ద సుమారు 20 మీటర్ల మేర కుంగింది. వర్షపు నీరు జలాశయంలోకి ప్రవేశించడంతో నెర్రె ఏర్పడింది. గురువారం ఘటనా స్థలాన్ని ప్రాజెక్టు ఎస్‌ఈ సి.సాయిబాబా పరిశీలించారు. ఈ ప్రదేశంలో ఇసుక బస్తాలతో వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేయించాలని ఈఈ ఎన్‌.ఉమాపతిరావు, ఏఈఈ కె.వెంకటేశ్వర్లులకు సూచించారు. నిర్మాణ సమయంలో సరైన పర్యవేక్షణ లేక జరిగిన లోపాలతోనే ఆనకట్ట ఇలా శిథిలావస్థకు చేరుతోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు