close

తెలంగాణ

మధుర భక్తులకు నిలయం.. అందుతండా

ఘనంగా రుషి పంచమి వేడుకలు

ఇంద్రవెల్లి, న్యూస్‌టుడే: అది చిన్న పల్లె.. అయితేనేమి.. నాలుగు రాష్ట్రాల మధుర భక్తులకు నిలయం. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం అందుతండా కైతి లబానా (మధుర జాతి) కుల దేవతలు కొలువుదీరిన గ్రామం. ఏటా గణేష్‌ ఉత్సవాల అనంతరం కాలుబాబా, పాచుబాబా, దుర్గాదేవిలకు మొక్కులు తీర్చుకోవడం వారి సంప్రదాయం. గురువారం అందుతండాలో నిర్వహించిన రుషి పంచమి ఉత్సవాలకు తెలంగాణలోని ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో ఉన్న మధురాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. రుషి పంచమి ఉత్సవాల్లో ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు, జడ్పీ ఛైర్మన్‌ రాఠోడ్‌ జనార్దన్‌, మధురాల జాతి గురువు రాంసింగ్‌ మహారాజ్‌, మధుర జాతి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తాన్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు