close

గ్రేటర్‌ హైదరాబాద్‌

పాత మార్గంలోనే పాతబస్తీకి మెట్రో

 దేశంలోనే ప్రజా రవాణాలో  నడుస్తున్నది ఇదొక్కటే
 పురపాలక పట్టణాభివృద్ధిశాఖ  మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోనే హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టు ఉత్తమమైనదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. ప్రైవేటుతో కలిసి ప్రజారవాణా రంగంలో నడుస్తున్న ఏకైక ప్రాజెక్టు ఇదేనని పేర్కొన్నారు. గురువారం ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మొదట నిర్ణయించిన ప్రణాళికకు భిన్నంగా మార్గంలో మార్పులేవీ చేపట్టలేదన్నారు. త్వరలో పాతబస్తీకి గతంలో నిర్దేశించిన మార్గంలోనే మెట్రో నిర్మాణం చేస్తామన్నారు. నగరంలో నడిచే ఆర్టీసీ ఏసీ బస్సు ఛార్జీల కన్నా తక్కువ ఛార్జీలే వసూలు చేస్తున్నారన్నారు. రూ.14,132 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భూసేకరణ, ఇతర రూపాల్లో రూ.3 వేల కోట్ల రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడి ఉందన్నారు. డిసెంబరు నాటికి 66 కిలోమీటర్ల మేర సేవలు అందుబాటులోకి రానున్నాయని కేటీఆర్‌ వివరించారు.

కమాండ్‌ కంట్రోల్‌ సిద్ధం
పోలీసుశాఖలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా రూ.350 కోట్లతో లక్ష సీసీ కెమెరాలను పర్యవేక్షించే కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం సిద్ధమవుతోంది.

- హోం మంత్రి మహమూద్‌ అలీ

 

భూ సమస్యలతో కలెక్టరేట్‌ భవన నిర్మాణాలు ఆలస్యం
కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు ఒకేచోట అన్ని ప్రభుత్వ శాఖల సేవలు అందుబాటులోకి తెచ్చేలా నిర్మిస్తున్న 26 సమీకృత కలెక్టరేట్ల భవనాలు వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తవుతాయి. మెదక్‌, మహబూబాబాద్‌ కలెక్టరేట్‌ భవనాల నిర్మాణం స్థల సమస్యతో ఆలస్యంగా ప్రారంభమైంది. రూ.843 కోట్లతో చేపట్టిన నిర్మాణాలను లక్ష్యం మేర పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నారాయణపేట, ములుగు జిల్లాలకు నిర్మాణాలు పరిశీలనలో ఉన్నాయి.

- రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి

 

మూడు లక్షల ఎకరాల్లో విత్తన సాగు
రాష్ట్రంలో 3 లక్షల ఎకరాల్లో  విత్తనసాగు చేస్తున్నాం. 18 దేశాలకు విత్తనాలు ఎగుమతవుతున్నాయి. నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. పీడీ కేసులు నమోదు చేశాం. హైదరాబాద్‌లో విత్తన పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. అన్ని రాష్ట్రాలు కేంద్రంపై ఆధారపడి విత్తనాల ఉత్పత్తికి రాయితీలు ఇస్తుంటే తెలంగాణ రూ.150 కోట్లు రాయితీ విత్తనాలకే కేటాయిస్తోంది.

- వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

 

థర్మల్‌ కేంద్రం ఏర్పాటు లేనేలేదు
దుబ్బాక నియోజకవర్గం తొగుట ప్రాంతంలో థర్మల్‌ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏర్పాటనేది వాస్తవం కాదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. విద్యుత్తు కేంద్రానికి 10 నుంచి 15 గ్రామాల్లో భూములు సేకరిస్తారన్న ప్రచారం జరుగుతోందని, దీనిపై స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కోరారు. తన నియోజకవర్గానికి కాళేశ్వరం జలాలివ్వాలని కోరారు. దీనికి మంత్రి సమాధానమిస్తూ దుబ్బాక ప్రాంతంలో 1.22 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు వస్తుందన్నారు. 319 చెరువులు నింపనున్నట్లు పేర్కొన్నారు.

- ఆర్థిక మంత్రి హరీశ్‌రావు

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు