close

క్రైమ్

అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష

కటక్‌(ఒడిశా), న్యూస్‌టుడే: ఒడిశాలోని కటక్‌ జిల్లా సాలేపూర్‌ ఠాణా పరిధిలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు గురువారం తీర్పునిచ్చింది. 2018 ఏప్రిల్‌ 21న గ్రామంలోని తన ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికను అదే ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ముస్తాక్‌ చాక్లెట్‌ కొనిస్తానని చెప్పి గ్రామంలోని పాఠశాల వెనక్కి తీసుకెళ్లి అత్యాచారం చేసి, హత్య చేశాడు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు