close

క్రైమ్

యువతి సహా తల్లిదండ్రుల అదృశ్యం

కుందూలో దూకి ఆత్మహత్య చేసుకున్నారని అనుమానం
  నిశ్చితార్థంపై కుటుంబంలో వివాదాలే కారణం!

రాజుపాళెం, న్యూస్‌టుడే: మరో మూడు రోజుల్లో కుమార్తె నిశ్చితార్థాన్ని పెట్టుకుని ఆమెతో సహా తల్లిదండ్రులు అదృశ్యమవడం విషాదాన్ని నింపింది. ఈ నిశ్చితార్థంపైనే కుటుంబంలో వివాదాలు తలెత్తి ముగ్గురూ మూకుమ్మడిగా కుందూ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటన కడప జిల్లా రాజుపాళెం మండలం గాదెగూడురు గ్రామంలో విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన కాకునూరు తిరుపతిరెడ్డి, వెంకటలక్ష్మమ్మ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు. పెద్ద కుమార్తె మౌనికను ప్రొద్దుటూరుకు చెందిన సుధీర్‌రెడ్డికిచ్చి పెళ్లి చేశారు. రెండో కుమార్తె హిమబిందును అదే గ్రామానికి చెందిన వ్యక్తికిచ్చి వివాహం చేశారు. మూడో అమ్మాయి ప్రవళికను కూడా అదే గ్రామానికి చెందిన యువకుడికిచ్చి పెళ్లి చేసేందుకు శనివారం నిశ్చితార్థానికి నిర్ణయించుకున్నారు. ఈ పెళ్లి విషయంలో 4రోజులుగా కుటుంబంలో కలహాలు తలెత్తాయి. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున మోటారుసైకిల్‌పై భార్య, చిన్న కుమార్తెతో తిరుపతిరెడ్డి కూలూరు సమీపంలోని కుందూ వంతెన వద్దకు వెళ్లారు. నదిలో వరద ఉద్ధృతంగా ఉంది. వారు నదిలో దూకి అత్మహత్య చేసుకుని ఉండవచ్చని బంధువులు, పోలీసులు అనుమానిస్తూ గాలిస్తున్నారు. వంతెన సమీపంలోనే మోటారుసైకిల్‌ ఉంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు