close

క్రైమ్

పనులు చేయిస్తూ.. కడుపు కాలుస్తూ

కువైట్లో మహిళకు కష్టాలు

వెంకటాచలం, న్యూస్‌టుడే: కువైట్‌లో వంట చేసుకుంటే డబ్బు సంపాదించవచ్చని ఆశపడిన ఓ మహిళ అష్టకష్టాలు పడుతున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలానికి చెందిన నూర్జహాన్‌ ఏజెంటు సాయంతో గతేడాది మార్చిలో కువైట్‌ వెళ్లారు. అక్టోబరు వరకు బాగానే ఉన్నా.. తర్వాత ఆమెను ఒంటెల వద్ద కూలిపనికి పెట్టారు. అప్పట్నుంచి జీతం ఇవ్వకుండా, అన్నం పెట్టకుండా వేధిస్తున్నారు. ఏడాదిగా ఫోన్‌ అందుబాటులో లేదు. వారం క్రితం తన కష్టాలను వివరిస్తూ బంధువులకు వాట్సాప్‌లో ఆమె వీడియో పంపారు. తనతోపాటు కడపకు చెందిన సాహీనా అనే మహిళనూ వేధిస్తున్నారని అందులో తెలిపారు. కూలి పని చేసుకునైనా బతుకుతానని, సొంత దేశానికి తీసుకెళ్లాలని వేడుకున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు