close

క్రైమ్

కన్నతండ్రి కాదు  కామ పిశాచి

కుమార్తెపై 3 నెలలుగా అత్యాచారం

వరంగల్‌ క్రైం, న్యూస్‌టుడే: కామంతో కళ్లు మూసుకుపోయి కన్న బిడ్డపైనే అత్యాచారానికి పాల్పడ్డాడో తండ్రి. ఇది పసిగట్టిన మరో కుమార్తె తల్లికి తెలియజేయడంతో దారుణం వెలుగు చూసింది. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన హన్మకొండలోని సుబేదారి పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరుకు చెందిన ఓ వ్యక్తి కొద్దిరోజుల కిందట జీవనోపాధి కోసం హన్మకొండకు వచ్చి.. కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె పది, చిన్న కుమార్తె 9వ తరగతి చదువుతున్నారు. చిన్నబిడ్డపై మూడు నెలల నుంచి ఈ మృగాడు అత్యాచారానికి ఒడిగడుతున్నాడు. మూడు రోజుల కిందట ఈ విషయాన్ని పెద్ద కుమార్తె పసిగట్టింది. ఈ విషయం అమ్మకు ఎందుకు చెప్పలేదని చెల్లిని ఆమె ప్రశ్నించగా.. చెబితే అమ్మను చంపేస్తానని బెదిరించడంతో భయపడ్డానని సమాధానం ఇచ్చింది. దీంతో ఈ విషయాన్ని పెద్ద కుమార్తె తల్లికి తెలియజేసింది. ఆమె భర్తను నిలదీయగా అసలు విషయం బయటపడడంతో బుధవారం అర్ధరాత్రి సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. హన్మకొండ ఏసీపీ శ్రీధర్‌ విచారణ జరుపుతున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు