close

క్రైమ్

పంట పండలేదని రైతు ఆత్మహత్య

కొడంగల్‌, న్యూస్‌టుడే: పంట సరిగా పండకపోవడంతో వికారాబాద్‌ జిల్లాలో ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకున్నారు. కొడంగల్‌ మున్సిపాలిటీ పరిధిలోని మార్కెÆట్‌ యార్డు సమీపంలో ఉంటున్న కమ్మరి శివాజీ (50) పొలంలో వేసిన వాము పంట సరిగా రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన గురువారం తెల్లవారుజామున పొలంలో విద్యుత్తు స్తంభానికి ఉరి వేసుకొన్నారు. కొడంగల్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. శివాజీ భార్య గౌరమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు