close

జాతీయ- అంతర్జాతీయ

జన ఉద్యమంగా జల నిర్వహణ

 లోక్‌సభ సభాపతి ఓం బిర్లా..
 వెదిరె శ్రీరాం పుస్తకావిష్కరణ

ఈనాడు, దిల్లీ: జల సంరక్షణ, నిర్వహణకు సంబంధించిన ఉద్యమాన్ని జన ఉద్యమంగా వెదిరె శ్రీరాం మార్చారని లోక్‌సభ సభాపతి ఓం బిర్లా ప్రశంసించారు. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం రచించిన ‘‘ఏ డిస్టింక్టివ్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ స్టోరీ-ద రాజస్థాన్‌ వే’’ పుస్తకాన్ని సభాపతి ఓం బిర్లా, కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్‌ షెకావత్‌, ప్రకాష్‌ జావడేకర్‌, కిషన్‌రెడ్డి, సంజయ్‌ ధోత్రేలు గురువారం రాత్రి ఆవిష్కరించారు. లోక్‌సభ సభాపతి ఓం బిర్లా మాట్లాడుతూ ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్‌లో జల వనరుల సృష్టిలో శ్రీరాం కృషి అభినందనీయమన్నారు. కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ మాట్లాడుతూ దేశంలో జల విప్లవం రావాలన్నారు. రాజస్థాన్‌లో శ్రీరాం చేపట్టిన ప్రాజెక్టు 99.7 శాతం విజయవంతమైందన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో గోదావరి-కృష్ణా నదులున్నా సాగు, తాగు నీటికి ఇబ్బందులున్నాయన్నారు. గోదావరి జలాలను ఎలా వినియోగించుకోవాలనే దానిపై శ్రీరాం గతంలోనే పుస్తకం రచించారని తెలిపారు. పుస్తకావిష్కరణకు ముందు రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి జల్‌ స్వావలంభన్‌ అభియాన్‌ కింద సాధించిన విజయాలను వెదిరె శ్రీరాం పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు