close

జాతీయ- అంతర్జాతీయ

కిరణ్‌ సందేహం.. నిర్మల సమాధానం

ఈ-సిగరెట్ల నిషేధం ప్రకటన విషయమై ప్రముఖ పారిశ్రామిక వేత్త, బయోకాన్‌ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కిరణ్‌ మజుందార్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ మధ్య ట్విటర్‌ వేదికగా ఆసక్తికర సంభాషణ జరిగింది. కిరణ్‌కు వచ్చిన సందేహానికి నిర్మలా సీతారామన్‌ సవివరంగా బదులిచ్చారు. నెటిజన్లు వీరి ట్వీట్లను ఆసక్తిగా గమనించారు. ఆ వివరాలివీ..

ఆ ప్రకటన ఆరోగ్యశాఖ నుంచి రాకూడదా!

ఈ-సిగరెట్లపై నిషేధం విధించామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఈ ప్రకటన చేయాల్సింది ఆరోగ్య మంత్రిత్వశాఖ కదా? గుట్కా నిషేధం విషయం ఏమైంది? ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయడానికి ఆర్థిక మంత్రిత్వశాఖ చేపట్టనున్న చర్యల సంగతి ఏమిటి?

-కిరణ్‌ మజుందార్‌షా

ఆరోగ్య మంత్రి విదేశాలకు వెళ్లినందునే..

కిరణ్‌.. కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ విదేశాలకు వెళ్లారు. ఈ-సిగరెట్లపై ఏర్పడిన మంత్రుల బృందానికి నేను నేతృత్వం వహించాను. అందువల్లే నేను ప్రకటించా. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ విలేకరుల సమావేశంలో ఉన్నారు. వివరాలు వెల్లడించేందుకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి నాతోనే ఉన్నారు. ఈ రకమైన పద్ధతులను ప్రభుత్వం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పాటిస్తామన్న సంగతి మీకు తెలిసిందే. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తీసుకున్న చర్యల విషయమై ఆ శాఖ మంత్రిగా నేను క్రమం తప్పకుండా మాట్లాడుతున్న విషయం కూడా మీకు తెలుసు.

- నిర్మలా సీతారామన్‌

ఇప్పుడు అర్థమైంది..

ఇప్పుడు అర్థమైంది. నా వ్యాఖ్యలను సరిచేసుకుంటున్నాను. పరిస్థితిని వివరించి నా గందరగోళాన్ని దూరం చేసినందుకు ధన్యవాదాలు. మీ స్పందనకు కృతజ్ఞతలు.

-కిరణ్‌ మజుందార్‌షా


 

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు