close

జాతీయ- అంతర్జాతీయ

మూలాల్లోకి వెళితేనే సమస్యలకు పరిష్కారం

ఈనాడు, దిల్లీ: క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించకుండా ప్రజల సమస్యలకు సరైన పరిష్కారాలు చూపలేరని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రజాప్రతినిధులకు సూచించారు. మలయాళంలోని ‘హైమవత భువిల్‌’ పుస్తకాన్ని ‘హిమాలయన్‌ ఒడిస్సీ’ పేరిట కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ వీరేంద్రకుమార్‌ అనువదించారు. దాన్ని గురువారం దిల్లీలో ఆవిష్కరించిన అనంతరం ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ... సమస్యల పరిష్కారానికి పార్టీలకు ప్రజలు గతంలో మాదిరిగా అధిక సమయాన్ని ఇవ్వటంలేదని, ప్రస్తుతం 5 నుంచి పదేళ్లు మాత్రమే వేచి చూస్తున్నారని తెలిపారు. ప్రజల ఆలోచన సరళి మారుతున్నందున నేతలు కూడా సమస్యల మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని సూచించారు. దేశంలో పర్యాటక రంగం అభివృద్ధికి కార్పొరేటు సంస్థలు ముందుకు రావాలని ఉప రాష్ట్రపతి పిలుపునిచ్చారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు