close

జాతీయ- అంతర్జాతీయ

విక్రమ్‌ కోసం యమునా స్తంభం ఎక్కి..

‘ల్యాండర్‌’తో సంబంధాలు పునరుద్ధరణ అయ్యే వరకూ దిగిరానంటూ భీష్మించిన యువకుడు

ఉత్తర్‌ప్రదేశ్‌: చంద్రునిపై అచేతనంగా ఉన్న విక్రమ్‌ ల్యాండర్‌తో సంబంధాలు పునరుద్ధరణ అయ్యేవరకూ దిగిరానంటూ యమునా నది వంతెన స్తంభం ఎక్కాడు... ప్రయాగ్‌రాజ్‌కు చెందిన రజనీకాంత్‌! జాతీయ జెండాను చేతపట్టి మూడు రోజులు తిండి లేకుండా అక్కడే గడిపాడు. ‘చందమామ ఆగ్రహం వల్లే విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లి ఉపరితలం మీద దిగడానికి కొన్నిక్షణాల ముందు గల్లంతయింది. అందుకే చంద్రుడి కటాక్ష వీక్షణాల కోసం ప్రార్థనలు చేస్తున్నా’నంటూ రాసి ఉన్న కాగితాన్ని సోమవారం వంతెన మీద నుంచి కిందకు విసిరాడు. అతడిని దించేందుకు పోలీసులు పలుమార్లు విఫలయత్నం చేశారు. చివరికి బనారస్‌ నుంచి హైడ్రాలిక్‌ యంత్రాన్ని తెప్పించి రజనీకాంత్‌ను కిందకు దించారు. అప్పటికే ఆ యువకుడిని చూసేందుకు జనం తండోపతండాలుగా వంతెన వద్దకు చేరుకున్నారు. దీంతో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది కూడా. ఇందుకుముందు కూడా రజనీకాంత్‌ రెండుసార్లు ఇలాగే యమునా వంతెనను ఎక్కాడట.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు