close

క్రీడలు

ధోనీ టైమ్‌ అయిపోయింది: గవాస్కర్

టీమిండియా భవిష్యత్‌పై దృష్టి పెట్టాలి

ముంబయి: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ భవితవ్యంపై రోజుకో వార్త ప్రచారంలో ఉంది. అతడి రిటైర్మెంట్‌పై అనేక వార్తలు వినిపిస్తున్న తరుణంలో లెజెండరీ బ్యాట్స్‌మన్‌, మాజీ సారథి సునీల్‌గవాస్కర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ధోనీ రిటైరయ్యే సమయం ఆసన్నమైందని ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ‘అతడి మీదున్న గౌరవంతో చెబుతున్నా.. ధోనీ టైమ్‌ అయిపోయింది. టీమిండియా భవిష్యత్‌పై దృష్టిసారించాలి. అయితే ధోనీని జట్టు సాగనంపకముందే.. అతడే వెళ్లిపోతాడని భావిస్తున్నా’ అని గవాస్కర్‌ చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉండగా దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు టీమిండియాని ప్రకటించిన వేళ ధోనీ భవితవ్యంపై సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ను మీడియా వివరణ కోరగా.. ధోనీ రిటైర్మెంట్‌పై ఎలాంటి సమాచారం లేదని చెప్పాడు. అలాగే ప్రచారంలో ఉన్నా ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టంచేశాడు. అలాగే కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ స్పందిస్తూ ధోనీకి మద్దతుగా నిలిచాడు. ధోనీ అనుభవం టీమిండియాకు ఎంతో ఉపయోగమని, అతడు యువ ఆటగాళ్లకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడని తెలిపాడు. ‘ధోనీ ఇంకా జట్టుకోసం ఆలోచిస్తున్నాడు, అతడు భారత జట్టుకు ఎంతో విలువైన ఆటగాడు. ఒకవేళ రిటైరవ్వాలనుకుంటే అది తన వ్యక్తిగత నిర్ణయం. ఆ విషయంపై ఇతరులెవరూ మాట్లాడాల్సిన అవసరం లేదు’ అని కోహ్లీ పేర్కొన్నాడు. 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు