close

సినిమా

హరీశ్‌.. మేము నీతో ఉన్నాం

హైదరాబాద్‌: వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘వాల్మీకి’ టైటిల్‌ వివాదంతో సినిమా పేరును మార్చిన విషయం తెలిసిందే. ‘గద్దలకొండ గణేష్‌’గా సినిమా పేరును మార్చారు. అయితే సినిమా పేరును మార్చడం పట్ల హరీశ్‌ శంకర్‌ మాట్లాడుతూ.. ‘మొదటిసారి నేను ఓడిపోయానని అనిపిస్తోంది. ఓడిపోవడం అంటే వ్యక్తిగతంగానో, ఒక డైరెక్టర్‌గానో, ఒక రైటర్‌గానో కాదు.. ఒక హైందవ సమాజానికి చెందిన వ్యక్తిగా వాల్మీకి మహర్షి మీద ఉన్న ఒక గొప్ప గౌరవాన్ని, ఒక మంచి విషయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో నేను ఓడిపోయానని నాకు అనిపిస్తోంది.’ అని ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్‌ దర్శకులు హరీశ్‌తోపాటు చిత్రబృందానికి మద్దతుగా నిలిచారు. దీనికి సంబంధించి వారు సోషల్‌మీడియా వేదికగా ట్వీట్లు చేశారు.

‘‘వాల్మీకి’ ఇప్పుడు ‘గద్దలకొండ గణేష్‌’గా మారింది. రిలీజ్‌ ముందు రోజు సినిమా టైటిల్‌ను మార్చడం ఇప్పటివరకూ ఎప్పుడూ, ఎవరికీ జరగలేదు. సినిమా టైటిల్‌ ఒక్కటే మారింది.. కథ అలాగే ఉంది బ్రదర్‌ హరీశ్‌. వరుణ్‌తేజ్‌తోపాటు చిత్రబృందానికి నా అభినందనలు.’ -బాబీ

‘ఇది చాలా బాధాకరం. ఇప్పటివరకూ ఏ సినిమాకి లేదా ఏ సినీ దర్శకుడికి ఇలా జరగలేదు. హరీశ్‌ మేమందరం నీతోనే ఉన్నాం. సినిమా పట్ల నీకున్న నిబద్ధత నాకు తెలుసురా.. ‘గద్దలకొండ గణేష్‌’ తప్పకుండా విజయం సాధిస్తుంది.’ - వంశీ పైడిపల్లి

‘సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు ఇలా టైటిల్‌ను మార్చడం నిజంగా దురదృష్టకరం. కానీ నాకు నమ్మకం ఉంది ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది.’ - రాహుల్‌ రవీంద్రన్‌.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు