close

క్రీడలు

ఒలింపిక్స్‌లో కబడ్డీ కోసం ప్రయత్నిస్తాం: రిజిజు

దిల్లీ: పారిస్‌ ఒలింపిక్స్‌ (2024)లో కబడ్డీని చేర్పించేందుకు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తుందని క్రీడల మంత్రి కిరెన్‌ రిజిజు అన్నాడు. ‘‘మన మూలాల్లోంచి వచ్చిన క్రీడ ఎలా ఎదుగుతుందో చెప్పడానికి కబడ్డీనే రుజువు. మనది వంద కోట్లకు పైగా జనాభా కలిగిన బలమైన దేశం. కాబట్టి వచ్చే ఒలింపిక్స్‌లో కబడ్డీ క్రీడను చేర్పించేందుకు మేం కచ్చితంగా గట్టి ప్రయత్నం చేస్తాం. ఇందుకోసం ఉమ్మడి ప్రయత్నం చేయాలి. ఈ విషయంలో నేనెంతో నమ్మకంగా ఉన్నా’’ అని రిజిజు చెప్పాడు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు