close

బిజినెస్‌

హెచ్‌ఎస్‌బీసీలో 10,000 ఉద్యోగాల కోత

హాంకాంగ్‌: అంతర్జాతీయ బ్యాంకింగ్‌ సేవల దిగ్గజం హెచ్‌ఎస్‌బీసీ భారీ సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేయడానికి సిద్ధమవుతోంది. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడానికి 10,000 మంది వరకు ఉద్యోగులును తొలగించనున్నట్లు ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది. ఇందులో అధిక వేతనాలు అందుకుంటున్న ఉన్నత ఉద్యోగులే ఎక్కువ ఉండొచ్చని సమాచారం. వడ్డీ రేట్లు పడిపోవడం, బ్రెగ్జిట్‌, అమెరికా- చైనా వాణిజ్య ఉద్రిక్తతల వల్ల గత కొంత కాలంగా సంస్థ ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. బలహీన అంతర్జాతీయ వృద్ధి వల్ల 4000 ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు