close

బిజినెస్‌

దివాలా పరిష్కార ప్రకియపై చట్టపరంగా ముందుకెళ్తాం

శ్రీదేవి డిజిటల్‌ సిస్టమ్స్‌

మాధవధార(విశాఖపట్నం), న్యూస్‌టుడే: విశాఖపట్నానికి చెందిన శ్రీదేవి డిజిటల్‌ సిస్టమ్స్‌ దివాలా పరిష్కార ప్రకియపై చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, దీనిపై చందాదారులు, కస్టమర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంస్థ ఎండీ ఇసుకపల్లి రామకృష్ణంరాజు అన్నారు. ఐస్‌ టీవీ నుంచి తాము సెట్‌టాప్‌ బాక్స్‌లు కొనుగోలు చేసి, సీఎఎస్‌కు సంబంధించి ఆ సంస్థ సూచించిన మేరకు, వారిచ్చిన ఇన్వాయిస్‌ బిల్లులు ప్రకారం ఐఆర్‌టీఈటీవో (సీఏఎస్‌) సంస్థకు నేరుగా చెల్లింపులు చేశామన్నారు. ఐస్‌ టీవీ సంస్థ అదనంగా కస్టమ్స్‌ ఛార్జీలు, ఐఆర్‌డీఈటీవో సంస్థకు చేసిన చెల్లింపులు పరిగణనలోకి తీసుకోకుండా వాటిని బకాయిలు రూపంలో చూపిస్తున్నారన్నారు. చట్టబద్ధంగా పరిష్కరించునేందుకు అవసరమైన చర్యల దిశగా ముందుకు వెళ్తామని చెప్పారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు