close

బిజినెస్‌

రిలయన్స్‌ మ్యూచువల్‌.. ఇక నిప్పాన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రిలయన్స్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పేరు ఇక నుంచి నిప్పాన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌గా మారింది. జపాన్‌కు చెందిన నిప్పాన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఏఎంసీలో 75శాతం వాటాను సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ పేరు మార్పు చోటు చేసుకుంది. దేశీయ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలో అధిక భాగం వాటా ఉన్న విదేశీ కంపెనీగా నిప్పాన్‌ మారింది. సంస్థ పేరు మారినప్పటికీ.. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, సీఈఓగా సందీప్‌ సిక్కా కొనసాగనున్నారు. మిగతా యాజమాన్యం, ఫండ్‌ నిర్వాహకుల్లోనూ ఎలాంటి మార్పు లేదని సంస్థ పేర్కొంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు