close

సినిమా

సాఫ్ట్‌వేర్‌ కుర్రాడి సరదాలు

సుడిగాలి సుధీర్‌, ధన్యబాలకృష్ణన్‌ జంటగా నటిస్తోన్న చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’. రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడు. కె.శేఖర్‌ రాజు నిర్మాత. చిత్రీకరణ  పూర్తయింది. గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘‘వినోదాత్మకంగా సాగే చిత్రమిది. రొమాన్స్‌, సందేశం ఉంటాయి. సుధీర్‌ - ధన్యా ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ’’ అన్నారు. ‘‘తొలి చిత్రంతోనే పేరున్న వాళ్లతో పనిచేసే అవకాశం దక్కింది. ఈ చిత్రానికి కథే హీరో. పవన్‌ కల్యాణ్‌, రజనీకాంత్‌లను నేను ఆరాధిస్తాను. వాళ్లిద్దరినీ ఈ చిత్రంలో అనుకరించా. సినిమాల్లోకి రావడానికి నాకు చిరంజీవి స్ఫూర్తి’’ అన్నారు సుధీర్‌. ‘‘బడ్జెట్‌ ఎక్కువైనా రాజీ పడకుండా నిర్మించాం. గద్దర్‌ ఓ పాట రాశారు. అది సినిమాకు ప్రధానాకర్షణ. డిసెంబరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత. ‘‘దర్శకుడికి ఇది తొలి చిత్రమైనా చక్కటి స్క్రిప్ట్‌తో మెప్పించారు. ఆయన రచనలో పరిణితి కనిపించింద’’న్నారు ధన్య బాలకృష్ణన్‌.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు