close

సినిమా

వినోదాల విహారం

‘ఆటగదరా శివ’తో ఆకట్టుకున్నారు ఉదయ్‌ శంకర్‌. తనకు నటుడిగా ఆ చిత్రం మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు మరోసారి విభిన్నమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ‘మిస్‌ మ్యాచ్‌’ చిత్రంతో. ఐశ్వర్య రాజేష్‌ కథానాయిక. ఎన్‌.వి.నిర్మల్‌ కుమార్‌ దర్శకుడు. అధిరోహ్‌ క్రియేటివ్‌ సైన్స్‌ సంస్థ నిర్మించింది. శ్రీరామ్‌ రాజు, భరత్‌ రామ్‌ నిర్మాతలు. చిత్రీకరణ  పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘‘ప్రేమ, వినోదం జోడించిన సరికొత్త కథ ఇది. ‘మిస్‌ మ్యాచ్‌’ అని ఎందుకు పెట్టామో సినిమా చూస్తే అర్థం అవుతుంది. నటుడిగా ఉదయ్‌ శంకర్‌ని మరో మెట్టు ఎక్కించే చిత్రం అవుతుంది. ‘కౌసల్య కృష్ణమూర్తి’తో ఇప్పటికే నిరూపించుకుంది ఐశ్వర్య. తన పాత్ర ఆశ్చర్యపరిచేలా ఉంటుంది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం. పవన్‌కల్యాణ్‌ చిత్రం ‘తొలిప్రేమ’లోని ఓ గీతాన్ని రీమిక్స్‌ చేశాం. ఆ పాట పవన్‌ అభిమానులకు నచ్చుతుంద’’ని దర్శక  నిర్మాతలు తెలిపారు. సంగీతం: గిఫ్టన్‌ ఎలైస్‌.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు