close

బిజినెస్‌

రతన్‌, జీఎంఆర్‌లకు గౌరవ డాక్టరేట్లు

నొయిడా: పారిశ్రామికవేత్తలు రతన్‌ టాటా, జీఎం రావులకు అమిటీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేసింది. విశ్వవిద్యాలయం వార్షిక స్నాతకోత్సవంలో భాగంగా వారికి గౌరవ డాక్టరేట్లు అందించారు. రతన్‌ టాటా కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. జీఎంఆర్‌ గ్రూపు ఛైర్మన్‌ జీఎం రావు డాక్టరేట్‌ను అందుకున్న తర్వాత.. ‘నాకు ఆదర్శంగా నిలిచిన రతన్‌ టాటాతోపాటు ఒకే వేదికపై డాక్టరేట్‌ను అందుకోవడం గౌరవంగా భావిస్తున్నాన’ని తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ) శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 33 ఏళ్ల విరామం తర్వాత కొత్త విద్యా విధానం అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు