close

బిజినెస్‌

2 రోజుల్లో 22,000 వీఆర్‌ఎస్‌ దరఖాస్తులు

దిల్లీ: స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) పథకాన్ని ప్రకటించిన 2 రోజుల్లోనే 22,000 మందికి పైగా ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని బీఎస్‌ఎన్‌ఎల్‌ సీనియర్‌ అధికారి ఒకరు గురువారం వెల్లడించారు. ఈనెల 5 నుంచి డిసెంబరు 3 వరకు అర్హులైన ఉద్యోగులు వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకునేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ అనుమతి ఇచ్చిన సంగతి విదితమే. మొత్తం 1.50 లక్షల మంది ఉద్యోగుల్లో లక్ష మంది వీఆర్‌ఎస్‌కు అర్హులైనా, 80,000 మంది వరకు దరఖాస్తు చేసుకుంటారన్నది సంస్థ అంతర్గత అంచనాగా పేరు వెల్లడించడానికి ఇష్టపడని అధికారి పేర్కొన్నారు. వీఆర్‌ఎస్‌ పథక మార్గదర్శకాలకు అన్ని విభాగాల సిబ్బంది నుంచి మంచి స్పందనే వస్తోందని, గ్రూప్‌ సి విభాగ సిబ్బందే 13,000 మంది దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు