close

బిజినెస్‌

మళ్లీ 12,000కు నిఫ్టీ

మార్కెట్‌ సమీక్ష

సూచీల లాభాల జోరు కొనసాగింది. ప్రభుత్వం స్థిరాస్తి రంగానికి సంస్కరణలు ప్రకటించడం, అమెరికా- చైనా వాణిజ్య చర్చల్లో పురోగతి నేపథ్యంలో సెన్సెక్స్‌ తాజా జీవనకాల గరిష్ఠాన్ని చేరగా, నిఫ్టీ మళ్లీ 12,000 పాయింట్లను అధిగమించింది. లోహ, ఇంధన, బ్యాంకింగ్‌ షేర్లు ఇందుకు దన్నుగా నిలిచాయి. సానుకూల త్రైమాసిక ఫలితాలు, విదేశీ మదుపర్ల పెట్టుబడులు కొనసాగడం సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా సూచీలు మెరుగ్గా ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 40,625.64 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అనంతరం అదే జోరు కొనసాగించిన సూచీ.. ఇంట్రాడేలో 40,688.27 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత డీలాపడ్డ సెన్సెక్స్‌.. ఒకానొకదశలో 40,421.07 పాయింట్లకు పడిపోయింది. చివరకు కోలుకుని 183.96 పాయింట్ల లాభంతో 40,653.74 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 46 పాయింట్లు పెరిగి 12,012.05 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 11,946.85- 12,021.40 పాయింట్ల మధ్య కదలాడింది.

* నిలిచిపోయిన ప్రాజెక్టులకు రూ.25,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించడంతో స్థిరాస్తి షేర్లు రాణించాయి. ఎన్‌బీసీసీ 8.20%, ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ 4.94%, ఫీనిక్స్‌ మిల్స్‌ 3.11%, శోభా 2.34%, ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌ 1.48% మేర లాభాలు నమోదు చేశాయి.
* త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ను మెప్పించకపోవడంతో టాటా స్టీల్‌ షేరు ఇంట్రాడేలో 3.79 శాతం కోల్పోయి రూ.389 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 0.30 శాతం తగ్గి రూ.403.15 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 16 లాభాలతో ముగిశాయి. సన్‌ఫార్మా 3.02%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.88%, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 1.86%, ఐటీసీ 1.78%, వేదాంతా 1.74%, ఏషియన్‌ పెయింట్స్‌ 1.57%, హెచ్‌డీఎఫ్‌సీ 1.38%, ఇన్ఫోసిస్‌ 1.07%, బజాజ్‌ ఫైనాన్స్‌ 0.99%, కోటక్‌ బ్యాంక్‌ 0.81% చొప్పున రాణించిన వాటిలో ఉన్నాయి. యెస్‌ బ్యాంక్‌ 3.27%, హెచ్‌యూఎల్‌ 1.93%, ఓఎన్‌జీసీ 1.86%, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.67%, టాటా మోటార్స్‌ 1.66%, ఎల్‌ అండ్‌ టీ 1.20% మేర నష్టపోయాయి. బీఎస్‌ఈలో 1319 షేర్లు లాభాల్లోనూ, 1203 షేర్లు నష్టాలతోనూ ముగిశాయి. 189 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు