close

బిజినెస్‌

మెర్సిడెస్‌ బెంజ్‌ వీ-క్లాస్‌ ఎలైట్‌ రూ.1.10 కోట్లు

చెన్నై: జర్మన్‌ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌ కొత్త మల్టీ-పర్పస్‌ వాహనం వీ-క్లాస్‌ ఎలైట్‌ను విపణిలోకి తీసుకొచ్చింది. గురువారం చెన్నైలో జరిగిన కార్యక్రమంలో కంపెనీ ఎండీ, సీఈఓ మార్టిన్‌ దీన్ని ఆవిష్కరించారు. వీ-క్లాస్‌ ఎక్స్‌ప్రెషన్‌, వీ-క్లాస్‌ ఎక్స్‌క్లూజివ్‌లకు అప్‌గ్రేడెడ్‌ వెర్షనే వీ-క్లాస్‌ ఎలైట్‌ అని ఆయన వెల్లడించారు. దీన్ని స్పెయిన్‌లో తయారు చేసి దేశీయ మార్కెట్‌లో విక్రయించనున్నారు. భారత్‌లో దీని ధర రూ.1.10 కోట్లుగా (ఎక్స్‌షోరూమ్‌) నిర్ణయించారు. వీ-క్లాస్‌ ఎక్స్‌ప్రెషన్‌ ధర రూ.68.40 లక్షలు కాగా, వీ-క్లాస్‌ ఎక్స్‌క్లూజివ్‌ ధర రూ.81.90 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌, ఇండియా). లగ్జరీ మార్కెట్‌ విభాగంలో 40 శాతం వాటా కలిగి ఉన్న మెర్సిడెస్‌ బెంజ్‌ ప్రతి నెలా ఓ కొత్త ఉత్పత్తిని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు కంపెనీ వెల్లడించింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు