close

బిజినెస్‌

హీరో బీఎస్‌-6 స్ల్పెండర్‌ ఐస్మార్ట్‌

ధర రూ.64,900

దిల్లీ: ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్‌ మొట్టమొదటి బీఎస్‌-6 నిబంధనలకు లోబడిన మోటార్‌సైకిల్‌ ‘స్ల్పెండర్‌ ఐస్మార్ట్‌’ను విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.64,900 (ఎక్స్‌-షోరూమ్‌ దిల్లీ). 110సీసీ ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌ ఇంజిన్‌ కలిగిన ఈ బైకు 9 బీహెచ్‌పీ శక్తిని అందించనుంది. పాత తరం వెర్షన్‌తో పోలిస్తే అధిక ఇంధన సామర్థ్యం, టార్క్‌ను కలిగి ఉందని హీరో వెల్లడించింది. ‘కంపెనీ విడుదల చేసిన తొలి బీఎస్‌-6 మోడల్‌ ఇది. కొత్త ఇంజిన్‌, కొత్త ఛాసిస్‌ డిజైన్‌ ఉన్న బైకును జయపూర్‌లోని సెంటర్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ టెక్నాలజీలో అభివృద్ధి చేశాం’ అని హీరో మోటోకార్ప్‌ హెడ్‌ (గ్లోబల్‌ ప్రోడక్ట్‌ ప్లానింగ్‌) మలో లీ మాసన్‌ అన్నారు. ఇక బీఎస్‌-6లోకి క్రమంగా మారడం ప్రారంభించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా బీఎస్‌-6 స్ల్పెండర్‌ ఐస్మార్ట్‌ను దశలవారీగా అందుబాటులోకి తెస్తామని, ఉత్పత్తిని సైతం స్థిరంగా పెంచనున్నట్లు కంపెనీ విక్రయాల హెడ్‌ సంజయ్‌ భాన్‌ అన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు