close

తెలంగాణ

కరీంనగర్‌ పోలీసులపై చర్య తీసుకోవాలి

 లోక్‌సభ సభాపతికి ఎంపీ సంజయ్‌ ఫిర్యాదు

ఈనాడు, దిల్లీ: పార్లమెంటు సభ్యునిగా తనకున్న హక్కులకు భంగం కలిగించేలా ప్రవర్తించి పోలీసులు ఉల్లంఘనకు పాల్పడ్డారని.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లోక్‌సభ సభాపతి ఓం బిర్లాకు కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ ఫిర్యాదు చేశారు. సభాపతిని గురువారం ఆయన కలిశారు. దాడి ఘటనకు సబంధించిన ఫిర్యాదు ప్రతిని అందజేశారు. కరీంనగర్‌కు చెందిన ఆర్టీసీ కార్మికుడు బాబు గుండెపోటుతో మరణించారని.. స్థానిక పార్లమెంట్‌ సభ్యునిగా బాబు అంతిమయాత్రలో పాల్గొంటున్న సమయంలో పోలీసులు దాడి చేశారని తెలిపారు. కరీంనగర్‌ ఇన్‌ఛార్జి పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ, అదనపు డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ సంజీవ్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వు ఏసీపీ నాగయ్య, ఇన్‌స్పెక్టర్‌ అంజయ్య, మరికొందరు దాడి చేసి దూషించారని తెలిపారు. ఈ అంశంపై ఇప్పటికే మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు సభాపతికి చెప్పారు. సంజయ్‌ చేసిన ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల సంఘం కేసు నమోదు చేసింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు