close

గ్రేటర్‌ హైదరాబాద్‌

‘విప్‌’ బాధ్యతల్లోకి గొంగిడి సునీత

ఈనాడు, హైదరాబాద్‌: ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి శాసనసభ విప్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు జగదీశ్‌రెడ్డి, హరీశ్‌రావు శ్రీనివాస్‌గౌడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్‌, సైదిరెడ్డి, భాస్కర్‌రావు, రాజ్యసభ సభ్యులు లింగయ్య యాదవ్‌, భువనగిరి మాజీ ఎంపీ నర్సయ్యగౌడ్‌, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, ఆలేరు నియోజకవర్గ నేతలు పాల్గొన్నారు. తనకు విప్‌గా రెండో దఫా అవకాశం ఇచ్చిన కేసీఆర్‌కు సునీత కృతజ్ఞతలు తెలిపారు. చట్టసభల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు