close

క్రైమ్

కేఎల్‌ నారాయణ నివాసంలో ఐటీ సోదాలు

ముదినేపల్లి, న్యూస్‌టుడే: కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం పెదగొన్నూరులోని ప్రముఖ సినీ నిర్మాత, దుర్గా ఆర్ట్స్‌ అధినేత కేఎల్‌ నారాయణ నివాసంలో గురువారం ఆదాయపుపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఆదాయపు పన్నుశాఖ విచారణ విభాగం ఆదేశాల మేరకు ఆ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎం.శ్వేత గురువారం సోదాలు చేపట్టారు. శ్వేత మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఏమీ దొరకలేదని చెప్పారు. విజయవాడ, భీమవరం, కొవ్వూరు, రాజమహేంద్రవరంలలో ఉన్న ఆయన బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయని ఆమె వివరించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు